Harish Rao : రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపు – హరీష్ రావు
Harish Rao : రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపు - హరీష్ రావు
- Author : Sudheer
Date : 13-09-2024 - 7:14 IST
Published By : Hashtagu Telugu Desk
Stop Rahul Gandhi’s lectures – Harish Rao : తెలంగాణ లో నెల రోజులుగా రాజకీయాలు సైలెంట్ గా కొనసాగుతుండగా..పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కాయి. పాడి కౌశిక్ రెడ్డి – అరికెపూడి గాంధీల (Kaushik Reddy Vs Arekapudi Gandhi) సవాళ్లతో తెలంగాణాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బిఆర్ఎస్ (BRS)నుండి గెలిచి కాంగ్రెస్ (Congress) లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీరలు , గాజులు పంపిస్తున్న..ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగురువేస్తా అని కౌశిక్ సవాల్ విసరడం..నెస్ట్ డే గాంధీ తన అనుచరులతో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ..ఆ తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ ఫై పిర్యాదు చేసేందుకు వెళ్తే వారిని అరెస్ట్ చేయడం..ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతుంది. హరీష్ రావు తో సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు రెండు గంటల సేపు వాహనంలో తిప్పారు..భుజం నొప్పి ఉందన్న కానీ హరీష్ రావు ను విడుదల చేయలేదు..ఈరోజు కూడా ఎక్కడిక్కడే బిఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ వ్యహరిస్తున్న తీరు ఫై హరీష్ రావు (Harish Rao) మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ (Law Under Order) ఉందా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. దాడి చేసిన వారికీ రాచమర్యాదలు..పిర్యాదు చేసేందుకు వెళ్తే అరెస్ట్ లు చేయడం..ఇదేనా కాంగ్రెస్ తీరు..? కౌశిక్ రెడ్డి మీద దాడి విషయంపై మేం ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అరెస్టు చేసి 2 గంటలు హైదరాబాద్‌లో తిప్పి అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జంగిల్‌లో విడిచిపెట్టారు. ఇదేనా పోలీసులు ప్రవర్తించే తీరు.. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ ఉందా..? అని నిలదీశారు. వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్తే.. ఖమ్మంలో రాళ్ల దాడి చేశారు. పది రోజులైనా దానిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.. ఆ గూండాలను అరెస్టు చేయలేదు. బిఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి కేసులు లేవు. మీరు ఎన్ని కేసులు పెట్టిన , దాడులు చేసిన బిఆర్ఎస్ శ్రేణులు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని రాళ్లు విసురుతావో విసురు.. ఆ రాళ్లే మళ్లీ మా ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయని హరీష్ రావు అన్నారు.
రాహుల్ (Rahul) అమెరికాలో లెక్చర్లు ఇస్తున్నాడు..
ఇదే సందర్బంగా రాహుల్ గాంధీ ఫై కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాహుల్ అమెరికాలో లెక్చర్లు ఇస్తున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం, ధర్మం అని ..ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అణిచివేతలు, ఆంక్షలు, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకం.. ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు కావా..? ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడానికి లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి, పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య కొట్లాటకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల సమస్య మీద నుంచి దృష్టి మరల్చుతున్నడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Read Also : Revanth in Chandrababu’s Trap : చంద్రబాబు ట్రాప్లో రేవంత్ – కౌశిక్ రెడ్డి