Smita Sabharwal : తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్
Smita Sabharwal : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాం(BRS Govt)లో సీఎంవోగా(CMO) స్మితా సేవలందించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కొద్దిరోజులు స్మితాకు పోస్టింగ్ ఇవ్వలేదు.తర్వాత ఆమెకు ఫైనాన్స్ సెక్రటరీగా గ్రూప్ వన్ స్థాయి పోస్టింగ్‌ను కేటాయించారు
- By Sudheer Published Date - 08:40 PM, Wed - 27 November 24

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal)..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్క్ లోనే కాదు షోషల్ మీడియాలోను నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని ఆమె తన అభిమానులు, ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాం(BRS Govt)లో సీఎంవోగా(CMO) స్మితా సేవలందించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కొద్దిరోజులు స్మితాకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమెకు ఫైనాన్స్ సెక్రటరీగా గ్రూప్ వన్ స్థాయి పోస్టింగ్‌ను కేటాయించారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ యువజన అభివృద్ధి, పర్యాటక & సంస్కృతి కార్యదర్శిగా (Secretary for Youth Advancement, Tourism & Culture, Govt of Telangana) కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఆ బాధ్యతలను ఆమె స్వీకరించారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేసారు. మొన్నటి వరకు ఆమెమహారాష్ట్రలో ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యతలు చేయడం జరిగింది. దాంతో నెలరోజుల పాటు అక్కడ విదులు నిర్వహించారు. బుల్దానా, మల్కాపూర్‌లో ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా విధులు నిర్వహించారు. ఈనెల 23న మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు రావడం తో నవంబర్ 24న తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు.
అంతకు ముందు మహారాష్ట్రలో విధులు నిర్వహించిన సమయంలో ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనివి.. మీ ప్రేమను వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని స్మితా మహారాష్ట్ర ప్రజలను , అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది. స్మితా సబర్వాల్ ఎక్కడికి వెళితే అక్కడి ప్రజలతో వెంటనే కలిసిపోతారనే టాక్ మొదటి నుండి ఉంది. తాను విధులు నిర్వహించే ప్రాంతాల్లో ఎక్కువగా సందర్శించడం కూడా ఆమెకు ఓ మంచి అలవాటు. అందుకే ఆమె ఎక్కువగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. అలాగే ఇక్కడ తాను దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. 2001 బ్యాచ్‌కు చెందిన తెలుగు కేడర్ స్మితా సబర్వాల్ భారతదేశంలో తన సేవలను అందించిన ప్రతి ప్రాంతంలో తన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. స్మితా సబర్వాల్ 19 జూన్ 1977న వెస్ట్ బెంగాల్‌లో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీ అధికారిగా పనిచేశారు. దీని వల్ల వివిధ ప్రాంతాల్లో ఆమె విద్యను కొనసాగించారు. స్మితా సబర్వాల్ విద్యార్థిగా అద్భుత ప్రతిభ చూపించారు. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 4వ ర్యాంకు సాధించి అత్యుత్తమ రికార్డును నెలకొల్పారు. 2001లో ఐఏఎస్ అధికారిగా తమ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, మొదట చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్‌గా నియమించబడ్డారు.
స్మితా తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత పథకాల అమలులో తనదైన ముద్ర వేశారు. GHMCలో పనిచేసిన సమయంలో మున్సిపల్ సేవల్లో అనేక మార్పులను ప్రవేశపెట్టారు. స్మితా సబర్వాల్ ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడంపై దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వ పనితీరును సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం ఆమె ప్రత్యేకతలుగా నిలిచాయి. స్మితా సబర్వాల్ తన దక్షతను ప్రదర్శిస్తూ అనేక అవార్డులు పొందారు, అందులో ఉత్తమ జిల్లాధికారి పురస్కారాలు, మరియు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న నాయకురాలు అనే గుర్తింపు అందుకున్నారు.
Work update!
Took charge today as Secretary for Youth Advancement, Tourism & Culture, Govt of Telangana.
Look forward to doing my best. pic.twitter.com/EoxDVddamL— Smita Sabharwal (@SmitaSabharwal) November 27, 2024
Read Also : Demolition Man : రేవంత్ ‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు..