BRS Party: బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి అంబర్ పేట కార్పొరేటర్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది.
- By Balu J Published Date - 01:15 PM, Fri - 22 September 23

BRS Party: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలంగాణలోని నియోజకవర్గాలు, ముఖ్య ప్రాంతాలు గురి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అసంత్రుప్త ఎమ్మెల్యేలు, పార్టీ చేరికలపై ద్రుష్టి సారించారు. తాజాగా ఆయన స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలపై ఫోకస్ చేసి ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిలను కలిసి పనిచేసేలా చక్రం తిప్పాడు.
తాజాగా బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి దంపతులు నేడు బిజెపిని వదిలి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంబర్పేట భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ చేరికతో అంబర్ పేట బీజేపీ గట్టి దెబ్బ తగిలినట్టయింది.
Also Read: Anasuya: పెళ్లికి ముందు సహజీవనం చేశా, అనసూయ కామెంట్స్ వైరల్