HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Shiv Shankar Master Is No More

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

  • By Hashtag U Published Date - 09:41 AM, Mon - 29 November 21
  • daily-hunt

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్‌ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్‌ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.

వశంకర్‌ మాస్టర్‌ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే మరణించే ముందు శివ శంకర్ మాస్టర్ కు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు కరోనా తో శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

 https://twitter.com/naralokesh/status/1464986569807335428

నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శివ శంకర్ మాస్టర్ కు సంతాపం తెలిపారు. ప్ర‌ఖ్యాత నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి విచార‌క‌రమని అన్నారు. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ఎన్నో చిత్రాల‌కు నృత్య‌రీతుల్ని స‌మ‌కూర్చి లెక్క‌లేన‌న్ని అవార్డులు సొంతం చేసుకుని, డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి మాస్ట‌ర్ మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటని లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

https://twitter.com/SonuSood/status/1464971618707378184


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • choreographer
  • covid
  • shiv shankar master

Related News

    Latest News

    • Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!

    • Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు ప్ర‌మోష‌న్‌.. టీమిండియా కెప్టెన్‌గా ప్ర‌క‌టించిన బీసీసీఐ!

    • Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్‌కు కొత్త ఊపును తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • Lokesh : ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ సక్సెస్.. రొయ్యల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

    • Bank of Baroda Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

    Trending News

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd