Telangana Govt Schools : తెలంగాణ ప్రభుత్వ స్కూల్ టైమింగ్స్ లలో మార్పులు
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారభించాలని నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 04:20 PM, Sun - 26 May 24

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారభించాలని నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9:00 గంటలకే తెరుచుకునేవి. గత విద్యాసంవత్సరం(2023-24)లో 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చారు. అయితే, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8:00 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9:30 గంటలకు వెళ్లడం వల్ల సర్కార్ బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9:00 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు బుర్రా వెంకటేశం ఆమోదం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఆరు, ఏడు తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం క్యాలెండర్ ను సైతం విడుదల చేసింది. ఈ సంవత్సరం జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని తెలిపింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని , డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు పూర్తిచేయనున్నట్టు వివరించింది. మార్చిలో పదోతరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది.
Read Also : Balakrishna : సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ