Santoor Scholarship : డిగ్రీ స్టూడెంట్స్ కు సంతూర్ స్కాలర్ షిప్స్.. కోర్సు పూర్తయ్యే దాకా నెలకు రూ.2వేలు
Santoor Scholarship : ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థినుల చదువుకు అండగా నిలిచేందుకు విప్రో ( Wipro)కు చెందిన సంతూర్ సంస్థ ముందుకు వచ్చింది.
- Author : Pasha
Date : 24-09-2023 - 8:07 IST
Published By : Hashtagu Telugu Desk
Santoor Scholarship : ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థినుల చదువుకు అండగా నిలిచేందుకు విప్రో ( Wipro)కు చెందిన సంతూర్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో డిగ్రీ ఫస్టియర్ లో ఉన్న విద్యార్థినులకు ఉపకారవేతనాలను సంతూర్ కంపెనీ అందిస్తోంది. అది కూడా ప్రతినెలా రూ.2వేలు. ఇంటర్మీడియట్ పూర్తిచేసి.. డిగ్రీ ఫస్టియర్ లో హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో చేరిన బాలికలు ఈ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ లో మెరిట్ తో పాటు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివిన గ్రామీణ నేపథ్యం ఉన్న పేద విద్యార్థినులకు ఈ ఎంపికలో ప్రయారిటీ ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ ను విప్రో కేర్స్, విప్రో కన్సూమర్ కేర్ అండ్ లైటెనింగ్ గ్రూప్ కలిసి అందిస్తున్నాయి. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ , కర్ణాటక , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి 1900 మందికి ఈ స్కాలర్ షిప్ ను మంజూరు చేయబోతున్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసి.. 2023-24లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరిన వారు అప్లై చేసుకోవచ్చు.
Also read : Petrol- Diesel Rates Today: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
కోర్సు పూర్తయ్యే వరకు ప్రతినెలా రూ.రెండు వేల చొప్పున ఎంపికైన విద్యార్థినులకు ఉపకారవేతనం అందిస్తారు. ఇలా మొత్తం సంవత్సరానికి రూ.24 వేలు అందిస్తారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవాలి. సంతూర్ స్కాలర్ షిప్స్ (Santoor Scholarship) అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింటవుట్ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. వీటికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. దరఖాస్తులను విప్రో కేర్స్- సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు – 560035, కర్ణాటక అడ్రస్ కు పోస్ట్ చేయాలి. ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థినులకు కూడా వర్తిస్తుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.santoorscholarships.com/ సందర్శించాల్సి ఉంటుంది.