Floods in Telangana : రాబందులు వస్తున్నారు ప్రజలారా జాగ్రత్త – సామ రామ్మోహన్ రెడ్డి
'సీఎం రేవంత్ రెడ్డి పాలన దెబ్బకి ప్రజల్లో ఉన్న కాస్త గుర్తింపు పోతుందని తప్పక ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పార్టీ రాబందులు
- By Sudheer Published Date - 05:09 PM, Tue - 3 September 24
బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల (BRS VS Congress) మధ్య డైలాగ్ వార్ (Dialogue War) ఆగడం లేదు. సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రానికి ఏదైనా ఆపద వస్తే..అధికార – ప్రతిపక్ష పార్టీలు సమన్వయం తో ప్రజలకు సాయం చేయడం..సలహాలు తీసుకోవడం..చర్చించుకోవడం వంటివి చేయాలి కానీ వీరు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు, దాడులు చేసుకుంటూ ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు. గడిచిన మూడు రోజులు తెలంగాణ లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు , రైల్వే ట్రాక్ లు , బ్రిడ్జ్ లు , భవనాలు , పంటపొలాలు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా వరదల కారణంగా మృతి చెందారు. ఇలాంటి ఈ భయానక సమయంలో కూడా ఇరు పార్టీల నేతలు ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నిన్న , ఈరోజు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి..గత ప్రభుత్వం ఫై పలు విమర్శలు చేసారు. ఇక ఈరోజు బిఆర్ఎస్ నేతలు ఖమ్మం లో పర్యటిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇలా ఉండగానే ట్విట్టర్ వేదికగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి పాలన దెబ్బకి ప్రజల్లో ఉన్న కాస్త గుర్తింపు పోతుందని తప్పక ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పార్టీ రాబందులు. ప్రజలారా జాగ్రత్త. మీ సహాయార్థం పంపిణీ పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వారే పంచుకు తినే బ్యాచ్ వీళ్ళు. వీరి పంపిణీ (ఏదైనా ఉంటే) పారదర్శకంగా ఉండేలా మీరే చర్యలు తీసుకోండి.’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
సీఎం @revanth_anumula గారి పాలన దెబ్బకి ప్రజల్లో ఉన్న కాస్త గుర్తింపు పోతుందని తప్పక ఒక్కొకరుగా బయటికి వస్తున్న @BRSparty రాబందులు.
ప్రజలారా జాగ్రత్త. మీ సహాయార్థం పంపిణీ పేరుతో ఫోటోలకు ఫోజు ఇచ్చి వారే పంచుకు తినే బ్యాచ్ వీళ్ళు. వీరి పంపిణీ (ఏదైనా ఉంటే) పారదర్శకంగా ఉండేలా మీరే…
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) September 3, 2024
Read Also : Floods in AP & Telangana : తెలుగు రాష్ట్రాలకు కోటి సాయం ప్రకటించిన బాలయ్య
Related News
Delhi Liquor Scam Case : కవిత బెయిల్ పై సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు