Congress Govt : రేవంత్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుంది – హరీష్ రావు
Telangana Govt : మార్పు, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని హరీష్ రావు దుయ్యబట్టారు
- By Sudheer Published Date - 11:24 AM, Fri - 6 December 24

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ(Indira Gandhi Emergency
)ని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టిన రేవంత్, నిర్భందాలు, అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజల హక్కులను హరించారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగపడుతున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని , ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ పాలనలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ దృష్టి ప్రజల సమస్యలపై కాకుండా ప్రతిపక్షాలపై తప్పు కేసులు పెట్టడంపైనే ఉందని ఆరోపించారు. నిర్బంధాలు, అరెస్టుల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అదుపులోకి తీసుకురావాలనే తాపత్రయం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హరీష్ రావు అన్నారు. రాజ్యాంగం ఉల్లంఘనల ద్వారా ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుందని , పాలనలో మార్పు తీసుకురావడం అంటే ప్రజల అవసరాలను తీర్చడం, పారదర్శకతను ప్రోత్సహించడమని, కానీ రేవంత్ ప్రభుత్వం ఈ మార్గంలో విఫలమైందని అన్నారు. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Read Also : Nara Lokesh Prajadarbar : 50 రోజులు పూర్తి చేసుకున్న నారా లోకేశ్ ప్రజాదర్బార్