HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Key Comments

CM Revanth : క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడు కేసీఆర్ – సీఎం రేవంత్

CM Revanth : కృష్ణా జలాల సద్వినియోగం కోసం కేసీఆర్ ఒక్క రోజు కూడా పోరాడలేదని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం గరిష్టంగా 220 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించలేదని గుర్తు చేశారు

  • Author : Sudheer Date : 01-07-2025 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Kcr
Revanth Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి రావడం వల్ల ఆ పార్టీ పూర్తిగా కూలిపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పునరుజ్జీవన కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నీటి సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్‌లో క్షుద్ర పూజలు చేయడం వంటివి చేసి బీఆర్ఎస్‌ను బతికించాలన్న ఆశతో కేసీఆర్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Karnataka : కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కలకలం..

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాది వేసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నీటి హక్కుల కోసం పోరాడలేదని ఆరోపించారు. 2015లో కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి, 68% నీటిని ఏపీకి వదిలిపెట్టిన దాన్ని “తెలంగాణకు మరణశాసనం”గా అభివర్ణించారు. ఇది రాష్ట్రానికి భారంగా మారిందన్నారు. కేంద్రం కూడా ఈ సమస్యపై స్పందించలేదని వాపోయారు. అప్పటి పాలకులు కమీషన్ల కోసం ప్రాణహిత-చేవెళ్లను వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, దానితో రాష్ట్రానికి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

Megastar : ఊహకందని స్థాయిలో మెగాస్టార్ ‘విశ్వంభర’లో వీఎఫ్ఎక్స్ షాట్లు

కృష్ణా జలాల సద్వినియోగం కోసం కేసీఆర్ ఒక్క రోజు కూడా పోరాడలేదని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం గరిష్టంగా 220 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించలేదని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తైతే మనకు వచ్చే వాటాను పూర్తిగా వినియోగించవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చనిపోయినట్టే అని, అలాంటి పార్టీని బతికించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల జలహక్కుల విషయంలో మాత్రం తమ ప్రభుత్వం రాజీ పడదని, అన్ని ముళ్లపట్టు దాటిన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Godavari water
  • kcr
  • KCR Farm House
  • Krishna Water

Related News

Cm Revanth Reddy Kerala Cam

keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

దశాబ్ద కాలంగా పినరయి విజయన్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)కు ఈసారి కేరళ ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురైంది

    Latest News

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd