HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Demands Withdrawal Of Go 317 Writes Open Letter To Cm

Revanth to KCR:కేసీఆర్ కి మళ్ళీ బహిరంగ లేఖ రాసిన రేవంత్

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పై దుమారం రేగుతోంది. ఉద్యోగుల స్థానికత పునాదిగా మెదలైన తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం సాధించిన ఏడేళ్ల తర్వాత అదే స్థానికత కోసం కన్నీళ్లు పెట్టాల్సివస్తోంది.

  • Author : Siddartha Kallepelly Date : 29-12-2021 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth reddy

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పై దుమారం రేగుతోంది. ఉద్యోగుల స్థానికత పునాదిగా మెదలైన తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం సాధించిన ఏడేళ్ల తర్వాత అదే స్థానికత కోసం కన్నీళ్లు పెట్టాల్సివస్తోంది.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.

తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది.

ఇదే అశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. ఇటీవల వరిధాన్యం అంశంపై కూడా రేవంత్ కేసీఆర్ కి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయని, సొంత జిల్లాలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని రేవంత్ తెలిపారు.

ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఉమ్మడి జిల్లా యూనిట్ గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగ్ లు ఇస్తున్నారని, దీంతో ఉద్యోగుల పిల్లలు దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ తెలిపారు.

బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో రిటైర్మెంట్ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోందని, తిరిగి సొంత జిల్లాకు వచ్చే మార్గమే లేదని రేవంత్ తెలిపారు.

సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని రేవంత్ సీఎంని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని, ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని రేవంత్ ముఖ్యమంత్రిని కోరారు.

కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా,మరికొందరికి శాపంగా మారింది.
ఉద్యోగుల విభజన,బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను,సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ఉప సంహరించుకోవాలి pic.twitter.com/QfaqjMJdo5

— Revanth Reddy (@revanth_anumula) December 29, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • G.O. 317
  • kcr
  • PCC chief
  • revan
  • revanth reddy
  • Telangana chief minister

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd