ఇక ఆ వాహనాలపై కేసీఆర్ ఫోటోలు కనిపించవు..
ఇక అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్..పాత బోర్డులను , పేర్లను , ఆఖరికి ఫోటోలను కూడా తొలగించడం మొదలుపెట్టింది
- By Sudheer Published Date - 08:44 PM, Sat - 9 December 23

అధికారం చేతిలో ఉంటే ఆడింది ఆట..పాడింది పాట..ఒక్కసారిగా అధికారం చేయిజారిందో అంతే సంగతి..బోర్డుల ఫై పేర్లే కాదు ఫోటోలు కూడా మారిపోతాయి. ప్రస్తుతం తెలంగాణ లో మాజీ సీఎం కేసీఆర్ (KCR) పరిస్థితి అలాగే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చి..పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ఇక మూడోసారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు పట్టం కట్టి..కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్..పాత బోర్డులను , పేర్లను , ఆఖరికి ఫోటోలను కూడా తొలగించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రగతి భవన్ ను కాస్త ప్రజా భవన్ ను చేసిన రేవంత్..తాజాగా 102 , 108 వాహనలపై ఉన్న కేసీఆర్ ఫోటోలను తొలగించడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 102 , 108 వాహనాలపై ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈఎంఆర్ఐ సీఈఓకి ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఆయా వాహనాలపై ఉన్న కేసీఆర్ ఫోటోలను తొలగిస్తున్నారు.
Read Also : Files Lost : తెలంగాణ పశువర్దక శాఖలో ఫైల్స్ మాయం…