Telangana : తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని..త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కీలక వ్యాఖ్యలు చేసారు.
- Author : Sudheer
Date : 27-09-2023 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని..త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అన్న ఆయన.. తమ కలలను సాకారం చేసుకోవడం కోసం పోరాటాలు చేసిన విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.
ఇక నిరుద్యోగులు కేసీఆర్‌కు ఓటు వేసే ప్రసక్తే లేదని జోస్యం తెలిపారు. కేసీఆర్ నియంత పాలన గురించి ప్రజలకు అర్దమైందన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జరగుతున్న అవినీతి గురించి సైతం ప్రజలకు తెలిసిపోంయిదని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. టెన్త్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు ఉన్నాయన్న ఆయన.. ఇటీవల జరిగిన టెట్ పరీక్షల్లో సైతం ఒక దానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారన్నారు. ఇక టీఎస్‌పీఎస్సీలో ఏకంగా బోర్డు సభ్యుల సంతకాలు సైత ఫోర్జరీ చేసిన విషయాన్ని రాజగోపాల్ గుర్తు చేశారు.
Read Also : Ramesh Bidhuri : ఎంపీని ఉగ్రవాది అని తిట్టిన రమేష్ బిధూరికి ప్రమోషన్.. బీజేపీలో కీలక పదవి