Preeti: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు వెనుక రాజకీయ క్రీడ, ఎన్ హెచ్ ఆర్ సి కి ఫిర్యాదు
ప్రీతి ఆత్మహత్య వెనుక రాజకీయ చీకటి కోణం నడిచిందని కాంగ్రెస్ భావిస్తుంది. నిందితుడు సైఫ్ ను కాపాడేందుకు
- By CS Rao Published Date - 08:20 PM, Mon - 27 February 23

ప్రీతి (Preeti) ఆత్మహత్య వెనుక రాజకీయ చీకటి కోణం నడిచిందని కాంగ్రెస్ భావిస్తుంది. నిందితుడు సైఫ్ ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నించారని ప్రీతి (Preeti) పేరెంట్స్ తో పాటు పలువురు అనుమానిస్తున్నారు. దానికి కారణం సైఫ్ తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీకి బంధువు. అందుకే కేసును నీరుకార్చారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. అంతే కాదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైఫ్ అనే సీనియర్ వేధింపుల వల్ల ప్రీతి (Preeti) ఆత్మహత్యయత్నం చేసింది. జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు నేం 3297/IN/2023.- బక్క జడ్సన్ కాంగ్రెస్ లీడర్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసి)లో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ధరావత్, తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీకి బంధువు అయిన సైఫ్ అనే సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థి ఇది 22/02/2023న కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో ఒకటైన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (MGMH)లో జరిగింది. సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సైఫ్‌పై తమ కుమార్తె కార్యాలయంలో వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా కేఎంసి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి కుల వివక్షకు గురైందని, ర్యాగింగ్‌కు గురైందని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను KMC అధికారులు తోసిపుచ్చారు.
చదువుకుంటున్న స్థలంలో సైఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్టాఫ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన సీనియర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే, ఆమెకు ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో, ఆమెను హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి బదిలీ చేశారు. పోలీసులు సైఫ్‌పై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. మెదక్లో ఖదీర్ ఖాన్ కస్టఓడియల్ డెత్ పై నోరు మెదపని తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ, తన బంధువు అయిన సైఫ్ ను కాపాడే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ హోమ్ మంత్రి బంధువులను కాపాడుకోవడానికే ఉన్నాడా. ప్రీతి ఆత్మహత్యాయత్నం కారకులైన వారిని వర్క్ ప్లేస్ హార్రాసెమెంట్ కింద వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
Also Read: Health ATM: యూపీలో 4,600 Health ATMల ఏర్పాటుకు ప్లాన్.. ఏమిటీ? ఎలా?