Airport : కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?
Airport : ప్రారంభంలో చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అనుకూల స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. రన్‌వే పొడవు, భూభాగ నిర్మాణం, పర్యావరణ సమస్యలు వంటి అంశాల వల్ల ఆ ప్రాంతాలను వదిలివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
- By Sudheer Published Date - 12:45 PM, Thu - 18 September 25

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ (Kothagudem Airport) నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరోసారి దశలవారీగా ముందుకు సాగుతున్నాయి. ప్రారంభంలో చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అనుకూల స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. రన్‌వే పొడవు, భూభాగ నిర్మాణం, పర్యావరణ సమస్యలు వంటి అంశాల వల్ల ఆ ప్రాంతాలను వదిలివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
Gold Price : తగ్గిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత ఉందంటే !!
తాజాగా భద్రాచలం-కొత్తగూడెం మధ్య ఉన్న విస్తారమైన స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రవాణా సౌకర్యాలు, భూమి లభ్యత, ప్రజా వ్యతిరేకత తక్కువగా ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో జరగబోయే ఫీజుబిలిటీ సర్వేలో ఈ ప్రాంతాన్నే చూపించాలనే ప్రభుత్వ యోచన కొనసాగుతోంది. ఇప్పటికే రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలో ఒకదాన్ని తుది నిర్ణయంగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరిగితే కొత్తగూడెం సహా భద్రాద్రి జిల్లాకు ఆర్థికంగా పెద్ద ఊతం లభిస్తుంది. కోల్ బెల్ట్‌గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాచలం ఆలయాన్ని సందర్శించే దేశ విదేశీ భక్తులకు ఈ విమానాశ్రయం బాగా ఉపయోగపడుతుంది. స్థానిక ప్రజలు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ స్థలాల ఎంపిక, భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు విజయానికి కీలకం కానున్నాయి.