PCC Star : రేవంత్ మాటలకు అర్థాలే వేరయ్యా.!
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(PCC Star) అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అదే సమయంలో వివాదస్పదం కూడా అవుతుంటారు.
- By CS Rao Published Date - 03:52 PM, Thu - 25 May 23

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(PCC Star) అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అదే సమయంలో వివాదస్పదం కూడా అవుతుంటారు. అదే ఆయనకు కలిసొచ్చిన రాజకీయం. కేవలం 15 ఏళ్లలోనే పీసీపీ పదవిని అందుకున్న లీడర్ గా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు, కీలక పదవులను నిర్వహించిన అపాపర అనుభవం ఉన్న వాళ్లు ఉన్నప్పటికీ, వాళ్లను కాదని ఏఐసీసీ రేవంత్ రెడ్డిని పీసీసీ పదవికి ఎంపిక చేయడం ఒక చరిత్ర. దాన్ని ఇప్పుడు మరింత హైప్ చేసుకుంటున్నారు రేవంత్.
రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు (PCC Star)
రాష్ట్రంలోని ఒక జాతీయ పార్టీకి చీఫ్(Revanth Star) అంటే సీఎం పదవి కంటే ఎక్కువని ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, సీఎం కేసీఆర్ తో పోల్చుకుంటే తన పదవి పెద్దదని కొలమానం చెప్పారు. ఒక ఉప ప్రాంతీయ పార్టీకి చీఫ్ గా ఉన్న కేసీఆర్ ఒక చిన్న రాష్ట్రానికి సీఎం మాత్రమేనంటూ చెబుతూ తన పీసీసీ పదవి పెద్దదని అంచనా వేసుకుని ఔరా అనిపించారు. ఇక, కాంగ్రెస్ లోని సీనియర్లను హోంగార్డులతో పోల్చుతూ తనకు తాను పొలిటికల్ ఐపీఎస్ సర్టిఫికేట్ బహిరంగంగా ఇచ్చుకున్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన `రెడ్డి` సామాజికవర్గానికి మాత్రమే రాజ్యాధికారం ఉండాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు కూడా `రెడ్డి` సామాజిక వర్గానికి నాయకత్వాలను అప్పగించాలని సూచించారు. ఇలా..పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత ఆయన పలు వివాదస్పద డైలాగులు (Dispute Revanth words)వేస్తూ వ్యూహాత్మకంగా అందరికీ కేంద్రబిందువు అయ్యారు.
గాంధీభవన్ ను యాదవులు, గొల్ల కురుమలు చుట్టుముట్టారు
ఇక ఇప్పుడు, మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ మీద సెటైర్లు వేశారు. పేడ పిసకడం చిన్నప్పటి నుంచే అలవాడే కదా అంటూ కేసీఆర్ ను ఎక్కడ పిసుకుతున్నావో చెప్పాలని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. పరోక్షంగా యాదవుల వృత్తిని కించపరుస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆ సామాజికవర్గం తిరగబడింది. గోవులు, గెదెలు కాసే యాదవులనే `పేడ పిసికే` వాళ్లని కించపరిచాడని ఆ సామాజికవర్గం నిలదీస్తోంది. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయాలని యాదవ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను నిరసిస్తూ గురువారం గాంధీభవన్ ను యాదవులు, గొల్ల కురుమలు చుట్టుముట్టారు. బహిరంగ క్షమాపణ రేవంత్ రెడ్డి(PCC Star) చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ..
వాస్తవంగా రేవంత్ రెడ్డి (PCC Star) ఆహార్యాన్ని కించపరుస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Srinivas yadav) ఎదురుపడు `పీక పిసికేస్తా..` అంటూ ఆగ్రహించారు. తీవ్ర స్వరంతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా `నువ్వెంత అంటూ ఎదుపడు పీక పిసికేస్తా.. ` అంటూ ఎగిరిపడ్డారు. దానికి బదులుగా తనదైన శైలిలో రేవంత్ రెడ్డి పిసకడం అలవాటు మంత్రి తలసానికి ఉందని పలు రకాల అర్థాలు వచ్చేలా డైలాగులు వేశారు. దీంతో ఇద్దరి మధ్యా రచ్చ మొదలయింది. అది కాస్తా, సామాజికవర్గం కోణం నుంచి మలుపు తిరిగింది. రాజకీయంగా మరింత ఎక్కువగా చేసేలా బీసీలను బీఆర్ఎస్ పోగుచేస్తోంది. రాబోవు రోజుల్లో యాదవులు, గొల్ల కురుమలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడేలా ప్లాన్ చేస్తోంది. దానికి ఎలాంటి విరుగుడును రేవంత్ రెడ్డి చూపిస్తారో చూద్దాం.
Also Read : Revanth Vs Talasani: తలసానిపై రేవంత్ ఫైర్.. ఘాటైన పదజాలంతో కౌంటర్

Related News

Dark Politics : తెలంగాణ `ఫిక్సింగ్` రాజకీయం
తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద అనుమానం ఏ పార్టీ దేనితో కలిసి చీకటి ఒప్పందం(Dark Politics) కుదుర్చుకుంది? అనే దానికి సమాధానం