Ram Mandir: అక్షింతలు అంటే రేషన్ బియ్యం కాదు: బండి ఫైర్
అక్షింతలను రేషన్ బియ్యంగా పిలవడం మంచిది కాదని పొన్నం ప్రభాకర్ కు సూచించారు బీజేపీ నేత బండి సంజయ్. అయోధ్యలోని అక్షింతలను రేషన్ బియ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
- Author : Praveen Aluthuru
Date : 18-01-2024 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Mandir: అక్షింతలను రేషన్ బియ్యంగా పిలవడం మంచిది కాదని పొన్నం ప్రభాకర్ కు సూచించారు బీజేపీ నేత బండి సంజయ్. అయోధ్యలోని అక్షింతలను రేషన్ బియ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అక్షింతలు అంటే ఏమిటో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అక్షింతల ప్రాధాన్యత తెలియకుండా మాట్లాడవద్దని పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని కోరారు .
ఈరోజు కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల కోరిక జనవరి 22న నెరవేరబోతోందని.. వారి సహకారంతోనే దివ్యమైన, అద్భుతమైన రామమందిర నిర్మాణం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు. హిందువుల. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలోని దేవాలయాలను శుద్ధి చేస్తున్నామని, అక్షింతల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. అక్షింతలను రేషన్ బియ్యం అని పిలిచే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు. అక్షింతల గురించి వ్యాఖ్యలు చేస్తే తమ ఇంట్లో అక్షింతలు వేస్తారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
అంతకుముందు వీరిద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం నడిచింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నేడు బండి స్పందిస్తూ కామెంట్స్ చేశారు.
Also Read: Vastu Tips: ఈ విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మి ఇంట్లో తిష్ట వేయడం ఖాయం?