Princess Esra: యాదాద్రికి నిజాం రాణి విరాళం.. 5 లక్షల బంగారం అందజేత
నిజాం ముకర్రం జా మాజీ భార్య (Princess Esra) యాదాద్రి ఆలయానికి రూ. 5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు.
- Author : Balu J
Date : 27-02-2023 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య, యువరాణి ఎస్రా (Princess Esra) యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సుమారు రూ. 5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఎస్రా రాజకుమారి తరపున యాదాద్రి టెంపుల్ (Yadadri Temple) డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి కిషన్ రావు నగలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతకు అందజేశారు. లండన్‌లో నివసించే యువరాణి ఎస్రా తరచుగా హైదరాబాద్‌కు, ఆమె స్వదేశమైన టర్కీకి రాకపోకలు కొనసాగిస్తోంది. అయితే ఆమె హైదరాబాద్ (Hyderabad) వచ్చినప్పుడల్లా యాదాద్రి ఆలయాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు.
అయితే ఈమె నిజానికి రాణి (Princess Esra) కాదు. టర్కీలో జన్మించిన ఎస్రా (Princess Esra) 1959లో హైదరాబాద్‌లోని అసఫ్ జా రాజవంశానికి చెందిన ప్రిన్స్ ముక్కరం జాను వివాహం చేసుకుంది. వారిది 15 సంవత్సరాల వివాహం. వారికి ఒక కుమార్తె షేఖ్య, కుమారుడు అజ్మెత్ జా ఉన్నారు. 2016లో ప్రారంభమైన ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం మార్చి 2022లో పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్చి 28, 2022న ప్రారంభించారు. పూర్తిగా రాతితో నిర్మింపబడిన ఈ ఆలయ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
Also Read: Global Star Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆ ఘనత అందుకున్న ఏకైక హీరో!