Escalator Accident : ఆర్‌కే సినీమాక్స్‌లో ఎస్కలేటర్ ప్రమాదం. 9మంది విద్యార్ధులకు గాయాలు
హైదరాబాద్‌లోని ఆర్‌కే సినీమాక్స్ మాల్‌లో ప్రమాదం జరిగింది.
- By Hashtag U Published Date - 12:11 PM, Thu - 18 August 22

హైదరాబాద్‌లోని ఆర్‌కే సినీమాక్స్ మాల్‌లో ప్రమాదం జరిగింది. గాంధీ సినిమా చూడటానికి వచ్చిన భారతీయ విద్యాభవన్ విద్యార్ధులు ఎస్కలేటర్‌మీద వెళుతుండగా ఒక్కసారిగా దాని వేగం పెరగడంతో విద్యార్ధులు కిందపడిపోయారు. ఈ ఘటనలో తొమ్మిదిమందికి గాయాలైనట్టు సమాచారం. గాయపడినవారిని వెంటనే దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతానికి విద్యార్ధులంతా సురక్షితంగా ఉన్నట్టు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు.