HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Musi River Rejuvenation Project Mp Asaduddins Criticism Of Brs Leaders

Asaduddin : నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారు : అసదుద్దీన్

మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలోనూ కసరత్తు జరిగిందని అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin) అన్నారు.

  • Author : Pasha Date : 02-11-2024 - 5:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musi River Rejuvenation Project Asaduddin Brs Leaders

Asaduddin : బీఆర్ఎస్ పార్టీ నేతలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారని ఆయన చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇళ్లను కదల్చకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తే తాను స్వాగతిస్తానని అసద్ వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Somy Ali : సల్మాన్‌కు అండర్ వరల్డ్ బెదిరింపు కాల్స్.. సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు

మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలోనూ కసరత్తు జరిగిందని అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin) అన్నారు. ఆనాడు రూపొందించిన విధానాలను బీఆర్ఎస్ పార్టీ నేతలే ఈనాడు మార్చుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఈవిధంగా బీఆర్ఎస్ పార్టీ విధానాలను మార్చుకోవడం సరికాదన్నారు. ఇలాంటి  వైఖరిపై ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అసద్ సూచించారు.

Also Read :SkyWalk : హైదరాబాద్ లో మరో స్కైవాక్..ఎక్కడంటే..!!

బీఆర్ఎస్ పార్టీకి గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడం అనేది తమ చలవేనని అసద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది  అభ్యర్థులను బీఆర్ఎస్ మార్చి ఉంటే.. మళ్లీ గెలిచి ఉండేదన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఉండేదని, అందువల్లే అభ్యర్థులను మార్చేందుకు ఇష్టపడలేదని ఆయన చెప్పారు. ‘‘తమతమ రాష్ట్రాల ప్రజలకు ఎక్కువ మంది సంతానం ఉండాలని సీఎంలు చంద్రబాబు, స్టాలిన్‌ చెబుతుంటే అందరూ వింటూ కూర్చున్నారు. అవే మాటలు నేను మాట్లాడి ఉంటే రాద్ధాంతం చేసి ఉండేవారు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు చాలా ఆలస్యంగా గుర్తించారని తెలిపారు. జనాభా ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం జరగడం ఖాయమన్నారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో   అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందన్నారు. జనాభాను నియంత్రణలో ఉంచిన రాష్ట్రాలను ప్రోత్సహించేలా విధాన నిర్ణయాలు ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asaduddin
  • brs
  • BRS Leaders
  • mim
  • Musi Project
  • Musi River Rejuvenation

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd