KCR : తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ – రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
కేసీఆర్కు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు
- Author : Sudheer
Date : 10-04-2024 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Murali Akunuri) కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) తెలంగాణ జెన్ కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసంపై ఆకునూరి మురళి స్పందిస్తూ..ప్రశంసలు కురిపించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. పగుళ్లు ఏర్పడిన రెండు పిల్లర్లు కూలే స్థితిలో ఉండగా.. తాజాగా అవి మరింత కుంగిపోయాయి. కాళేశ్వరంలోనే ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజురోజుకు కుంగిపోతుంది. గతేడాది కొంత కుంగిన మేడిగడ్డపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో కూలిన పిల్లర్లను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవాలని చూస్తున్నదని బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సైతం పూర్తిగా పక్కకు పెట్టింది. ప్రాజెక్ట్ కూలితే కానీ కేసీఆర్ నిర్లక్ష్యం , అవినీతి పూర్తి స్థాయిలో బయటపడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఓ పక్క ప్రాజెక్ట్ రోజు రోజుకు ప్రమాద స్థాయికి చేరుకోవడం తో ఎప్పుడు ఏంజరుగుతుందో అని అంత భయపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇలాంటి ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ జెన్ కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాసాన్ని షేర్ చేసి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్కు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ‘ధన్యవాదాలు రఘు ( నిబద్దత కలిగిన తెలంగాణ genco ఇంజనీర్ ) KCR అనే తెలంగాణకు పట్టిన శని రాజకీయ నాయకుడు తన అహంకార మూర్ఖ వ్యవహార శైలితో కట్టిన అవినీతి అబద్దాల కంపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలను పరిశోధించి ఇప్పటికి ఆడుతున్న BRS నాయకుల అబద్ధాలను నిజాలతో డీ కొట్టుకుంటూ రాసిన పదునైన చక్కని వ్యాసం. ప్రతి తెలంగాణ వాది చదవాలి. ప్రజలకు విడమర్చి నిజాలను చెప్పాలి. దోషులను (KC రావు, Harishrao, మురళీధర్ రావు సాంకేతిక మంజూరు ఇచ్చిన ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను) జైలు శిక్షలు పడేంతవరకు తెలంగాణ ప్రజలు పోరాడాలి’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మురళి షేర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతుంది.
ధన్యవాదాలు రఘు ( నిబద్దత కలిగిన తెలంగాణ genco ఇంజనీర్ )
KCR అనే తెలంగాణ కు పట్టిన శని రాజకీయ నాయకుడు తన అహంకార మూర్ఖ వ్యవహార శైలితో కట్టిన అవినీతి అబద్దాల కంపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలను పరిశోధించి ఇప్పటికి ఆడుతున్న BRS నాయకుల అబద్దాల ను నిజాలతో డీ కొట్టుకుంటూ రాసిన…— Murali Akunuri (@Murali_IASretd) April 10, 2024
Read Also : Kasani Gnaneshwar : కాసానిని గెలిపించుకుంటాం అంటున్న చేవెళ్ల ప్రజలు