Mulugu Seethakka : నన్ను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారు – ములుగు సీతక్క
ములుగులో నన్ను ఓడించేందుకు బిఆర్ఎస్ రూ.200 కోట్లు ఖర్చు చేస్తుందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ములుగులో పోటీ చేస్తోంది నాగజ్యోతి కాదు.. కేసీఆర్(kcr), కేటీఆర్(ktr) లని , దొంగ నోట్లు కూడా పంచుతున్నారని సీతక్క ఆరోపించింది
- By Sudheer Published Date - 04:41 PM, Mon - 13 November 23

ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క..బిఆర్ఎస్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.
ములుగులో నన్ను ఓడించేందుకు బిఆర్ఎస్ రూ.200 కోట్లు ఖర్చు చేస్తుందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ములుగులో పోటీ చేస్తోంది నాగజ్యోతి కాదు.. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లని , దొంగ నోట్లు కూడా పంచుతున్నారని సీతక్క ఆరోపించింది. ఇక గ్రామాల్లో గత కొద్దీ రోజులుగా మద్యం ఏరులై పారుతోంది. ‘సీతక్క మంత్రి అవుతుందంట’ అంటూ హేళన చేస్తున్నారు. బడుగు బలహీనవర్గాలు మంత్రులు కావద్దా?, ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా?, దొరల తెలంగాణ కావాలా..? ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ (Congress) కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని అన్నారు. మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ (BRS) నేతలు మన ఇళ్లల్లోకి వస్తే తిరగబడండి.. తరిమి కొట్టండి’’ అని సీతక్క పిలుపునిచ్చారు.
అలాగే మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ సీతక్క ఫైర్ అయ్యింది. ‘నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బిఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు.
ములుగులో తనను ఓడించేందుకు సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావు, కెటిఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బిఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్