HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Said Kcr Saved Singareni Tbgks Won The Rights

MLC Kavitha: సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ : కల్వకుంట్ల కవిత

  • Author : Balu J Date : 22-12-2023 - 5:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavithabrs
Kavithabrs

MLC Kavitha: హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కేసీఆర్ గారు కాపాడారని, టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను సాధించిందని పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని వివరించారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని ప్రస్తావించారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిననాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం18 శాతంగా ఉండేదని, దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 32 శాతానికి పెంచారని చెప్పారు. తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలియజేశారు. అంతేకాకుండా, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితం వైద్య సౌకర్యం కల్పించారని, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 10 లక్షల మేర రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేయడం వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.

కార్మికుల కోసం గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని తేల్చిచెప్పారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఒక్క సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని పనులను, డిమాండ్లను సాధించుకున్నామని కవిత పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elections
  • kcr
  • MLC Kavitha
  • singareni

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ

    • Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

    • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

    • Hyderabad : ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే మహిళల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    Trending News

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd