HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mixed Opinions On Kcr Change Constitution Statement

Opinion: రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ స్టేట్మెంట్స్ పై ఇంట్రెస్టింగ్ ఒపీనియన్స్

బడ్జెట్ పై కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ బీజేపీ వ్యతిరేకులందరూ కేసీఆర్ ని మెచ్చుకునేలా చేసింది.

  • By Siddartha Kallepelly Published Date - 08:18 AM, Thu - 3 February 22
  • daily-hunt
Parliament Kcr
Parliament Kcr

బడ్జెట్ పై కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ బీజేపీ వ్యతిరేకులందరూ కేసీఆర్ ని మెచ్చుకునేలా చేసింది. బడ్జెట్ పై ఇంత సీరియస్ గా యే సీఎం రియాక్ట్ అవ్వలేదని కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఆయన్ని అభినందించారు. మోదీని, బీజేపీని ఈ రేంజ్ లో దుమ్ముదులపడం కేసీఆర్ కి మాత్రమే సాధ్యమని, తమ సీఎంలు కూడా అలా మాట్లాడితే చూడాలని ఉందని చాలా రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజ్యాంగం మారాల్సిన అవసరముందని, అవసరమయితే కొత్త
రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయాలని కేసీఆర్ అనడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

నిజానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఒక మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. కేసీఆర్ రాజ్యాంగాన్ని, అది రాసిన అంబేద్కర్ ని అవమానపరిచారని పలు నిరసన కార్యక్రామాలకి పిలుపునిచ్చింది. కేసీఆర్ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ భీం దీక్ష కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు అరవింద్, బాబురావు తో సహా మరికొంతమంది ఎంపీలతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.

కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదని ఇప్పటివరకు రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించామని, రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉన్న పలు ఆర్టికల్స్ ని సవరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే జీఎస్టీ, రైతు చట్టాలు, 370 లాంటి
రాష్ట్రాల హక్కులను కాలరాసే చట్టాలకు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు అవే కారణాలని చూపిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనడంపై విమర్శలు వస్తున్నాయి.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తోన్న బీజేపీపై కూడా విమర్శలు వస్తున్నాయి. గోవాలో జరిగిన హిందూ అతివాదుల సమావేశంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా పెట్టాలని తీర్మాణం చేశారని, దానికి ముఖ్యమంత్రి హోదాలో బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హాజరయ్యాడని ఆయన విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని బండి సంజయ్ ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని నేటికీ గుర్తించదని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఉమ్మడి లిస్ట్ ని అడ్డం పెట్టుకుని బీజేపీ చేయని అవమానం లేదని, స్టేట్ లిస్ట్ లో ఉన్న ఫార్మా రంగాన్ని ఓవర్ రూల్ చేసి రైతు చట్టాలు చేసిందని, రాజ్యాంగం కాశ్మీర్ ప్రజలకు హామీ పడిన ఆర్టికల్ 370 రద్దు చేసిందని, రాజ్యాంగ వ్యతిరేక సీఏఏ ఎన్ఆర్సీ చట్టాలను తెచ్చిందని ఇవన్నీ రాజ్యాంగ అపహాస్యాలు, అవమానాలు
కాదా అని బీజేపీని ప్రశ్నిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • constitution
  • kcr
  • KCR statement
  • Telangana BJP

Related News

Group-1 Candidates

KCR : పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు – సీఎం రేవంత్

KCR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో సాగునీటితో పాటు, విద్యారంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాలమూరు ప్రాంతం వెనుకబాటుతనానికి 'చదువు లేకపోవడం' కూడా ఒక ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Deeksha Divas

    Deeksha Divas : తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి బీజం పడింది ఇదే రోజు

  • Kcr Osd

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డే విచారణ

Latest News

  • Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్ర‌క‌టించే ఛాన్స్‌?!

  • IND vs SA T20 Series: సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. భార‌త్ జ‌ట్టును ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు?!

  • Potatoes: మీరు కూడా ఆలుగ‌డ్డ‌ల‌ను ఇలా చేస్తున్నారా?

  • Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd