Protocol : నేను అలగలేదు – మంత్రి పొన్నం క్లారిటీ
అధికారులు తమ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు
- By Sudheer Published Date - 02:08 PM, Tue - 9 July 24

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రోటోకాల్ పాటించలేదనే కారణంతో తాను అలిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) క్లారిటీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారి కల్యాణోత్సవం (Balkampet Yellamma Kalyanam) కన్నువలపండువగా జరిగింది. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామి, అమ్మవార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే ఈ కల్యాణ వేడుకకు మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) సైతం హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉదయాన్నే ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో అధికారులు తమ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అనుదీప్‌పై మంత్రి సీరియస్ అయ్యారు. కనీసం వీఐపీలు వస్తున్న టైంలో ప్రోటోకాల్ పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆ టైంలో సెక్యూరిటీ ఎందుకు లేదని నిలదీశారు.
కాసేపు గుడిముందే కూర్చున్నారు. తర్వాత అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత గుడిలోపలికి వెళ్లి దర్శించుకున్నారు. మంత్రి అలిగారనే వార్త మీడియా లో హైలైట్ కావడం తో ఆ వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. ప్రోటోకాల్ పాటించలేదనే కారణంతో తాను అలిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. మహిళలు వెళ్లేటప్పుడు తోపులాట జరిగిందని, అందులో మేయర్ విజయలక్ష్మి ఇబ్బంది పడ్డారన్నారు. దానిపైనే తాను అధికారులను ప్రశ్నించానని అని తప్ప మరొకటి కాదన్నారు. అలాగే మహిళా రిపోర్టర్ కు ఎదురైన చేదు అనుభవానికి ఆయన క్షమాపణ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
Read Also : James Anderson: చరిత్ర సృష్టించేందుకు 9 వికెట్ల దూరంలో అండర్సన్.. రికార్డు ఏంటంటే..?