AIMIM First List: ఎంఐఎం ఫస్ట్ లిస్ట్ రిలీజ్, జాబితాలో పేర్లు దక్కించుకున్నది వీళ్లే
పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరు స్థానాలకుగాను ఫస్ట్ లిస్టు ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
- By Balu J Published Date - 03:04 PM, Fri - 3 November 23

AIMIM First List: తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరు స్థానాలకుగాను ఫస్ట్ లిస్టు ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. చంద్రాయనగుట్ట నుంచి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బలాల పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని పార్టీ చీఫ్ తెలియజేశారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, ఎంఐఎంతో పొత్తు ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.
ఎంఐఎం ఫస్ట్ లిస్ట్
చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ
మలక్ పేట- అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్
నాంపల్లి- మజీద్ హుస్సేన్
యాకుత్ పురా- జాఫర్ హుస్సేన్
చార్మినార్ – మీర్ జుల్ఫికర్ అలీ
Also Read: MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత