Transfers : తెలంగాణ పోలీసుశాఖలో భారీ ఎత్తున బదిలీలు?
Transfers : డీజీ, అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఈ మార్పులు చేపట్టాలని యోచన జరుగుతోంది
- By Sudheer Published Date - 06:54 AM, Mon - 26 May 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) పోలీసు శాఖలో విస్తృత స్థాయిలో బదిలీల(Transfers )కు శ్రీకారం చుట్టనుంది. డీజీ, అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఈ మార్పులు చేపట్టాలని యోచన జరుగుతోంది. ఇప్పటికే బదిలీల జాబితా సిద్ధం చేస్తుండగా, అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్న దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీలోపు ఈ బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖలతో సమీక్షలు చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. పోలీసులు, ప్రజల మధ్య నమ్మకాన్ని పెంచేలా, శాంతి భద్రతల నిర్వహణను మరింత బలోపేతం చేసేలా ఈ మార్పులు ఉంటాయని అంచనా.
Karun Nair: 3,000 రోజుల నిరీక్షణకు ముగింపు.. జట్టులో చోటు సంపాదించడంపై కరుణ్ రియాక్షన్ ఇదే!
ఈ బదిలీలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవనున్నారని తెలుస్తోంది. బదిలీల విషయంలో సేవావ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, నైపుణ్యం ఉన్న అధికారులను కీలక ప్రాంతాల్లో నియమించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త పాలనలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేపడుతోంది.