Marri Shashidhar Reddy : రేవంత్ దెబ్బకు `మర్రి` వికెట్ డౌన్?
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిథర్ రెడ్డి ఆ పార్టీ జలక్ ఇచ్చేలా మాట్లాడారు. పార్టీ వీడే సంకేతాలు ఆయన ఇవ్వడం తెలంగాణ కాంగ్రెస్ కల్లోలాన్ని మరింత పెంచింది. పార్టీ నుంచి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్ వినిపించిన మాటలనే మర్రి కూడా చెప్పడం గమనార్హం.
- Author : CS Rao
Date : 17-08-2022 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిథర్ రెడ్డి ఆ పార్టీ జలక్ ఇచ్చేలా మాట్లాడారు. పార్టీ వీడే సంకేతాలు ఆయన ఇవ్వడం తెలంగాణ కాంగ్రెస్ కల్లోలాన్ని మరింత పెంచింది. పార్టీ నుంచి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్ వినిపించిన మాటలనే మర్రి కూడా చెప్పడం గమనార్హం.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మర్రి శశిథర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన చేసిన హోంగార్డ్ వ్యాఖ్యలు, అద్దంకి దయాకర్ బూతులు, సీనియర్లను కించ పరిచేలా బండకేసి కొడతా, రెడ్డి సామాజిక నాయకత్వం కావాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన పీసీసీ అయిన తరువాత కొందర్ని తీసుకొచ్చి హడావుడి చేసినంత మాత్రన పార్టీ బలపడినట్టు కాదని ఆయన అన్నారు.
ప్రజలకు, న్యాయకత్వానికి, క్యాడర్ కు మధ్య గ్యాప్ పెరుగుతుందని మర్రి ఆందోళన చెందారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్, రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు, రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా తీసుకెళుతున్నారని పలు ఆరోపణలు చేశారు. సమన్వయం, ఆలోచన లేకుండా పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మర్రి శశిథర్ రెడ్డి ఆందోళన చెందారు.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రూపంలో సంక్షోభం నెలకొంది. సీనియర్లు మూకుమ్మడిగా రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా పార్టీని నడిపించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇంకో వైపు రేవంత్ రెడ్డితో మునుగోడు లో పాదయాత్ర చేయించాలని తెలంగాణ ఇంచార్జి సన్నద్ధం అవుతున్నారు.