Hyderabad : ప్రియురాలి ఫై ప్రియుడు కత్తి తో దాడి
పాతబస్తీ ఛత్రినాకలో తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు
- By Sudheer Published Date - 12:01 PM, Tue - 18 June 24

మహిళలఫై దాడులు అనేవి ఆగడం లేదు..పోలీసులు ఎంత కఠిన శిక్షలు విధించిన కొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడడం..కాదంటే కత్తి తో దాడి చేయడం కామన్ గా మారింది. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలు చోటుచేసుకోవడం..కొంతమంది ఆడవారు మరణించడం జరుగగా..తాజాగా ఈరోజు ఉదయం పాతబస్తీలో ఇదే తరహాలో ఘటన జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
పాతబస్తీ ఛత్రినాకలో తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పారిపోయేందుకు ట్రై చేయగా.. స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడిన యువతిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వైద్యులు తెలిపారు.
కాగా, యువతికి ఇప్పటికే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని చుట్టుపక్కల వారు తెలిపారు. ఇదే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు శివ తో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో శివ గత కొద్దీ రోజులుగా ప్రేమ పేరుతో వేదిస్తుండడంతో అతడితో మాట్లాడకుండా ఉంటుంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం జిమ్ కు వెళ్లి ఇంటికి వచ్చిన సదరు యువతీ ఫై దాడి చేసాడు.
Read Also : MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి