Deputy CM Bhatti : రుణమాఫీ డబ్బులు రైతుకే.. ఇవాళ బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో బ్యాంకర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు.
- Author : Pasha
Date : 18-07-2024 - 7:57 IST
Published By : Hashtagu Telugu Desk
Deputy CM Bhatti : ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో బ్యాంకర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులను మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు తప్పనిసరిగా రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) కోరనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రూ.లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము రూ.7 వేల కోట్లను ఇవాళ సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణఖాతాల్లో జమ చేయనున్నారు. బుధవారం ప్రజాభవన్‌లో పీసీసీ నేతల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. రుణమాఫీ అమలు చేసేందుకు తాము నిద్రలేని రాత్రులు గడిపామన్నారు. రూపాయి.. రూపాయి పోగుచేసి ఇస్తున్నామని తెలిపారు. రేషన్‌కార్డులు లేని దాదాపు ఆరు లక్షల మంది సహా రైతులు అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని నాలుగు దఫాలుగా పూర్తిచేసిందని.. రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రూ.రెండు లక్షల వరకూ రుణమాఫీని నెల వ్యవధిలోనే అమలు చేస్తోందని భట్టి తెలిపారు.
Also Read :Threats To Biden : చంపేస్తానంటూ బైడెన్‌కు ఓ వ్యక్తి వార్నింగ్స్.. ఏమైందంటే..
ఇక ప్రజాభవన్‌లో బుధవారం పీసీసీ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. చేసిన పనులు చెప్పుకోవడంలో ఎంతో వెనకబడి ఉన్నామని కాంగ్రెస్ నేతలతో రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన కేవలం 7 నెలల్లో సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యామన్నారు. ఇందులో పార్టీ వైఫల్యంతో పాటు ప్రభుత్వ వైఫల్యమూ ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు రైతు రుణమాఫీపై(Farmers Loan Waiver)పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.