TS Polls 2023 : తెలంగాణ లో వరుసగా మూడు రోజులు వైన్ షాప్స్ బంద్
నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు
- By Sudheer Published Date - 10:44 AM, Tue - 21 November 23

అసలే ఎన్నికల (Elections) సమయం..మద్యం , బిర్యానీ పాకెట్స్ , డబ్బు తోనే అంత నడుస్తుంది. ముఖ్యంగా అన్ని చోట్ల మద్యం ఏరులై పారుతుంది. ఈ క్రమంలో మందుబాబులకు షాకింగ్ న్యూస్ తెలిపారు అధికారులు. మూడు రోజుల పాటు వైన్ షాప్స్ , బార్లు ఇలా అన్ని మూతపడనున్నట్లు (Liquor sale banned) తెలిపారు. ఎన్నికల పోలింగ్ సమయానికి సరిగ్గా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తూ..కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే ప్రచారంలో రోజువారీ డబ్బులు , మందు , బిర్యానీ ఇలా అన్ని ఇస్తూ వారిని బంగారు బాతులా చూసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రోజు కూలి చేసుకునే వారు ఏమాత్రం కష్టపడకుండా రూపాయి ఖర్చు లేకుండా డబ్బు , మద్యం , అన్నం దొరకడం తో ప్రతి రోజు పలు పార్టీల ర్యాలీ లలో , ప్రచారంలలో పాల్గొంటూ వస్తున్నారు. కాగా నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక్క రోజు బంద్ చేస్తే బాగుండు కానీ మూడు రోజులు బంద్ అంటే మందుబాబులు తట్టుకోలేకపోతున్నారు.
Read Also : Amit Shah: దేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ కేసీఆర్: సీఎంపై అమిత్ షా ఫైర్