KTR: కరెంట్ కొరతతో శిశువులు, పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?
- By Balu J Published Date - 07:11 PM, Wed - 22 May 24
KTR: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరుగుతోందో మీరే గమనించండి అని, ఉత్తర తెలంగాణలో పేదలకు దిక్కు అయినటువంటి ఎంజీఎం లాంటి పెద్ద హాస్పిటల్ లో 5 గంటలు కరెంట్ లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఐదు గంటలు కరెంట్ పోతే నవజాత శిశువులు, ఐసీయూలో పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఎవరిది అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వడ్లు అన్నింటికీ రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాడంట అని కేటీఆర్ ఆరోపించారు.
‘‘మన దగ్గర అసలు సన్న వడ్లే తక్కువ. యాసంగిలో సన్న వడ్లే పండవు. అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. లేదంటే కావాలనే మోసం చేసేందుకు సన్న వడ్లకే బోనస్ అని అంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి కాదు, రెండు కాదు…మోసాల పరంపర కొనసాగుతోంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతదని చెప్పాం. కరెంట్ కోతలు ఉన్నాయా? మార్పు బాగుందా? ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తులతో కట్టాం. కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్ పని ఎక్కడికక్కడే వదిలేశారు.’’ అని కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
‘‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎంజీఎం హాస్పిటల్ కడితే… దాన్ని ఆపిన దౌర్భగ్యాపు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవసరమా? మేము ఎన్నో ఐటీ కంపెనీలను తెచ్చాం. కానీ ఇప్పుడు టెక్ మహీంద్రా వరంగల్ నుంచి వెళ్లిపోతోంది. టెక్ మహీంద్రా వెళ్లిపోయింది. ఎంజీఎం హాస్పిటల్ పనులు ఆపేశారు. కరెంట్ పోతోంది. మరి ఎందుకు వీళ్లకు ఓటు వేయాలి? రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాల్సింది పోయి…వచ్చిన కంపెనీలను కూడా కాపాడుకునే సోయి లేకుండా పోయింది’’ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Related News
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క