KTR : ‘మా ఫామ్ హౌస్’ FTL పరిధిలో ఉంటే కూల్చేయండి – కేటీఆర్ ప్రకటన
KTR Farm House : బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు మీరే కదా అనుతులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు చేసింది మీరే కదా..! ఇప్పుడు వాటిని కూలగొడితే రిజిస్ట్రేషన్ డబ్బులు రేవంత్ రెడ్డి తిరిగి ఇస్తాడా..? జీవో ఇచ్చాం పోండి అంటే ఎలా..?
- By Sudheer Published Date - 09:05 PM, Wed - 16 October 24

తమ ఫామ్ హౌస్ (Farm House) FTL పరిధిలో ఉంటే కూల్చేయాలని, దీనిపై తాను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ (Congress)..ఇటీవల హైడ్రా పేరుతో ఓ వ్యవస్థ ను తీసుకొచ్చి FTL పరిధిలో , బఫర్ జోన్లో ఇళ్లు ఉంటె కూల్చేస్తున్నా సంగతి తెలిసిందే. అయితే ఈ జోన్ లో ఉన్న రాజకీయ నేతల ఇళ్లను , బడాబాబుల ఇళ్లను వదిలి..పేదవారి ఇళ్లను కూల్చేస్తు వస్తుంది. దీనిపై ప్రజలు , ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెడుతూ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు మీరే కదా అనుతులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు చేసింది మీరే కదా..! ఇప్పుడు వాటిని కూలగొడితే రిజిస్ట్రేషన్ డబ్బులు రేవంత్ రెడ్డి తిరిగి ఇస్తాడా..? జీవో ఇచ్చాం పోండి అంటే ఎలా..? ఏ చర్చ లేకుండా, అనాలోచితంగా చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. మూసీ పరివాహక ప్రాంతానికి రా.. వాళ్ల ముందు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పు.. ఎలా మూసీ సుందరీకరణ చేస్తావు..? ఎలా అభివృద్ధి చేస్తావో చెప్పు..? అంటూ కేటీఆర్..సీఎం ను ప్రశ్నించారు. బఫర్ జోన్‌లో మల్లయ్య ఇల్లు ఉండకూడదట.. కానీ ఇల్లు తీసేసి మాల్ కట్టొచ్చట.. అదేం లాజిక్ అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై విరుచుకపడ్డారు. ఇళ్లల్లోకి మురికి నీరు వస్తుంది కానీ మాల్లోకి రాదా?’ అని ప్రశ్నించారు.
పాలన చేతగాక ఈ మాటలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చాక్‌పీసులకు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులకు, గురుకుల భవనాలకు కిరాయిలు, తులం బంగారం ఇచ్చేందుకు, పెన్షన్లు, రుణమాఫీకి పైసల్లేవు. కానీ మూసీని లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరణ చేస్తామంటున్నారు. వరద సహాయం చేస్తామన్నారు.. ఒక్క రూపాయి సహాయం చేశారా..? నెలన్నర అయింది. ఖమ్మం, మహబుబాబాద్‌లోని వరద బాధితులకు వారి ఖాతాల్లో రూ. 17500 వేస్తామన్నారు. వేశారా..? నీ ప్రాధాన్యత ఏంది.. పేద ప్రజల.. నీ ఖజానా నింపుకోవడమా..? ఢిల్లీ పెద్దలకు, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపడమే నీ పనా..? అని ఘాటైన వ్యాఖ్యలు చేసారు.
Read Also : KTR