Nagam Janardhan Reddy : నాగం తో కేటీఆర్ , హరీష్ రావు భేటీ..
బీఆర్ఎస్ లో చేరాలన్న తమ ఆహ్వానం పట్ల నాగం జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే నాగంను కలిశామని వివరించారు
- Author : Sudheer
Date : 29-10-2023 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీ మరో వికెట్ కోల్పోయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో సీనియర్ నేత , నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy
) పార్టీ కి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ టికెట్‌ను కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. ఇక ఈయన కార్ ఎక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం గచ్చిబౌలిలోని నాగం నివాసానికి బిఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ (KTR) , హరీష్ రావు (harish Rao) లు వెళ్లి సమావేశమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
సమావేశం అనంతరం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో చేరాలన్న తమ ఆహ్వానం పట్ల నాగం జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ (CM KCR) సూచన మేరకే నాగంను కలిశామని వివరించారు. సీఎం కేసీఆర్, నాగం మధ్య 40 ఏళ్ల స్నేహం ఉందని, వారిద్దరూ చిరకాల మిత్రులని తెలిపారు.
బీఆర్ఎస్ లో చేరడం పట్ల సుముఖత వ్యక్తం చేసినందుకు నాగంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. నాగం, ఆయన అనుచరులకు బీఆర్ఎస్ లో కచ్చితంగా సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని స్పష్టం చేశారు.
Read Also : Oats Soup : ఓట్స్‌తో సూప్ తాగారా ఎప్పుడైనా? ఓట్స్ సూప్ తయారీ విధానం..