Telangana : కొడంగల్‌లోనే గెలవని రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవా
కొడంగల్‌లో గెలవని రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో గెలుస్తారా? అని ప్రశ్నించారు
- Author : Sudheer
Date : 31-10-2023 - 5:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS – Congress)పార్టీల్లో జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. అదే క్రమంలో రేవంత్ – కేటీఆర్ (Revanth vs KTR)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇరువురు ఎక్కడ తగ్గడం లేదు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా..రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ (KCR) ఫై పోటీ చేస్తానని..అధిష్టానం ఛాన్స్ ఇస్తే కామారెడ్డి లో కేసీఆర్ ఫై పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్..రేవంత్ ఫై ఎద్దేవా చేసారు.
మంగళవారం మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో గెలవని రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో గెలుస్తారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న రేవంత్ డిపాజిట్‌ను కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని అన్నారు.
”పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల సమస్యలు కేసీఆర్ పరిష్కరించారు. గజ్వేల్ మాదిరిగానే కామారెడ్డిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక అధికారిని నియమించి కామారెడ్డి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కేసీఆర్ నియోజకవర్గం కామారెడ్డిలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి” అని కేటీఆర్ వెల్లడించారు.
Read Also : CBN Is Back : జైలు నుండి బయటకు వచ్చాక మీడియా తో చంద్రబాబు ఏమన్నారంటే..