Komatireddy Venkat Reddy : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy : ఇటలీలోని ప్రఖ్యాత పాలిటెన్సికో డి టోరినోలో అర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్‌లో మాస్టర్స్ సీటు పొందిన ప్రణవి చొల్లేటి(Pranavi)కి ఆర్థిక సహాయం చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు
- By Sudheer Published Date - 05:20 PM, Sun - 29 December 24

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MInister Komatireddy Venkat Reddy) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ (Prateek Foundation) ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్న మంత్రి కోమటిరెడ్డి, ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించారు. తాజాగా ఇటలీలోని ప్రఖ్యాత పాలిటెన్సికో డి టోరినోలో అర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్‌లో మాస్టర్స్ సీటు పొందిన ప్రణవి చొల్లేటి(Pranavi)కి ఆర్థిక సహాయం చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేకపోతున్న విద్యార్థిని పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందించారు. ప్రణవిని ఇంటికి పిలిచి మాట్లాడి , ఫౌండేషన్ తరఫున లక్ష రూపాయల సాయం అందించి ఆమె చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తన చదువుల కోసం మంత్రి చేసిన సహాయంపై ప్రణవి హర్షం వ్యక్తం చేశారు. తన కష్టం గుర్తించి, ప్రేమతో ఇంటికి పిలిపించి సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి కి ఎప్పటికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. విద్యార్థి భవిష్యత్తు కోసమే తనవంతు చేయూత అందిస్తానని కోమటిరెడ్డి చెప్పడంపై ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదువు అన్ని జీవితాలను మార్చగల ఆయుధమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే దృఢసంకల్పంతో ఆయన చేసిన సాయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సాయం అందించేందుకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
Read Also : New Year Celebrations : హైదరాబాద్ లో ఆ నాల్గు పబ్బులకు షాక్ ఇచ్చిన పోలీసులు