HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kodandaram Said Peoples Anger Against Kcr Government Is Not Small

Kodandaram: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం చిన్నదేమీ కాదు : కోదండరామ్

ఈ సందర్భంగా కోదండరామ్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీని గుర్తు చేశారు.

  • Author : Balu J Date : 02-12-2023 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Jana Samithi Kodandaram Sensational Comments
Telangana Jana Samithi Kodandaram Sensational Comments

Kodandaram: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి, కాంగ్రెస్‌ గెలుపు దిశగా సాగుతున్న వివిధ సర్వేలతో తెలంగాణ సాధించుకున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొ.ఎం.కోదండరామ్ అన్నారు. ఓటర్లకు అభినందనలు తెలిపిన ఆయన, ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చిందన్నారు. ఇష్టానుసారంగా అధికారం పేరుతో ‘దోపిడీ’కి పాల్పడితే ఏమవుతుందో ప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెప్పారని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మాత్రమే కాకుండా, తన అనుభవం ఆధారంగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రొఫెసర్ చెప్పారు. ‘కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వం’పై ప్రజల్లో ఉన్న ఆగ్రహం చిన్నదేమీ కాదని ఆయన అన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తిగా మారారని అన్నారు. ‘నిరుద్యోగ సమస్యను జాతీయ స్థాయిలో సీరియస్‌గా తీసుకోకపోతే, దాని ప్రభావం జాతీయ రాజకీయాలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది.

ఈ సందర్భంగా కోదండరామ్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అదే వైఖరిని ప్రదర్శించారని అన్నారు. ఇందిర హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కాకపోయినా ప్రజాసంఘాలు ఏకమై ఎదురుదాడి చేసి తమ సత్తా చాటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • cm kcr
  • exit polls
  • kodandaram

Related News

Supreme Court

Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అజారుద్దీన్‌, కోదండ‌రాంల నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు సంబంధించిన ఫైళ్లు, ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే సమర్పించాలని కోరిన పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. జస్టిస్ విక్ర‌మ్ నాథ్‌, జస్టిస్ సందీప్ మెహ‌తాలతో కూ

    Latest News

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. ప్రతిభావంతురాలైన విద్యార్థినికి అండ‌

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd