KCR Nomination : గజ్వేల్‌లో నామినేషన్ వేసిన కేసీఆర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను కొద్దీ సేపటి క్రితం ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు
- Author : Sudheer
Date : 09-11-2023 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ఓ పక్క ప్రచారం చేస్తూనే ..మరోపక్క నామినేషన్ల (Nominations) పర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ (BRS) నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు తమ నామినేషన్లను దాఖలు చేయగా..ఈరోజు ముహూర్తం బాగుండడం తో మిగతా సభ్యులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు కీలక నేతలైన ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (Harish Rao), అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను (KCR File Nomination to Gajwel) కొద్దీ సేపటి క్రితం ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్ (KCR). మరికాసేపట్లో కామారెడ్డికి కేసీఆర్ బయల్దేరనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల లోపు కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయల్దేరారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మరికాసేపట్లో నామినేషన్ పత్రాలు అందజేయబోతున్నారు.
Read Also : KTR Warning : BRS అభ్యర్థులకు కేటీఆర్ హెచ్చరిక..?