CM KCR: ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన కేసీఆర్, ఘటనపై ఫోన్ లో ఆరా!
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
- By Balu J Published Date - 04:21 PM, Mon - 30 October 23
CM KCR: బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు.
ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బిఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం దుర్ఘటన పై మంత్రి హరీశ్ రావు ను సీఎం ఫోన్లోఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Also Read: Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
Related News
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.