HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Leader Speech

MLC Kavitha Leader : ‘లీడర్’ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha Leader : “తల్లి గర్భం నుంచి నాయకత్వ లక్షణాలతో ఎవరూ పుట్టరు, నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఎదిగేవాడే నిజమైన నాయకుడు అవుతాడు” అంటూ ఆమె స్పష్టం చేశారు.

  • Author : Sudheer Date : 26-07-2025 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Leader
Kavitha Leader

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లీడర్’ (Leader) శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త తరం నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. “తల్లి గర్భం నుంచి నాయకత్వ లక్షణాలతో ఎవరూ పుట్టరు, నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఎదిగేవాడే నిజమైన నాయకుడు అవుతాడు” అంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ జాగృతి కాలానుగుణంగా మారుతూ ముందుకు సాగుతోందని, అదే ఈ సంస్థ బతికుండే బలమైన కారణమని పేర్కొన్నారు. “సాంస్కృతిక మౌలికతలు, సంప్రదాయాలు మన జీవనశైలిలో భాగం కావాలి. అవగాహనతో కూడిన మార్గదర్శనం లేని నాయకత్వం ఎన్నటికీ నిలదొక్కుకోలేదు” అని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా విషయపరమైన విమర్శలు చేయడం నేర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. పక్కవారిని తిడితే మనకే కంటెంట్ లేకపోవడం స్పష్టమవుతుందని అన్నారు.

Diet with Juice : డైట్ పేరిట బరువు తగ్గేందుకు కేవలం పండ్ల రసాలే తాగుతున్నారా? మీ ప్రాణాలకే డేంజర్

ఓ తాజా సర్వే ప్రకారం సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆమె, యువత సామాజిక బాధ్యతతో కూడిన నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ ఎప్పుడూ అధికార పదవుల్లో లేనిప్పటికీ, ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి నుంచి ‘గాంధీగిరి’కి నూతన రూపం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విమర్శలు కూడా మర్యాదగా, హేతుబద్ధంగా చేయాలన్నది ఆమె సూచన.

సాంస్కృతిక పునాదులు లేకుండా జాతుల అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి సమాజం పునాది లేని బిల్డింగ్ లాంటిదని స్పష్టంచేశారు. తెలంగాణ జాతికి గొప్ప సాంస్కృతిక నేపథ్యం ఉందని, దాన్ని పరిరక్షించేందుకు ‘జాగృతి’ నిరంతరం శ్రమిస్తోందన్నారు. ఆధునిక నాయకత్వాన్ని సాంస్కృతిక, మానవీయ విలువలతో మేళవించి తీర్చిదిద్దే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాలు సాగాలన్నదే ఎమ్మెల్సీ కవిత సందేశం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kavitha
  • Kavitha Leader Program speech
  • Leader Program
  • MLC Kavitha Leader

Related News

Bigshock

TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి

  • Kavitha Municipal Election

    తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • Kavitha

    బిఆర్ఎస్ ఆ తప్పు చేయడం వల్లే అధికారం కోల్పోయింది – కవిత

Latest News

  • ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

  • అమీషా పటేల్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

  • Tiger : తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న పులిని వదిలేశారా..? అదేంటి ?

  • టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కి రాజస్థాన్ రాయల్స్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd