Jalagam Venkat Rao : ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలోకి దిగిన జలగం వెంకటరావు
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున ఈరోజు నామినేషన్ దాఖలు చేసి షాక్ ఇచ్చారు
- By Sudheer Published Date - 03:43 PM, Fri - 10 November 23

మొన్నటి వరకు జలగం వెంకటరావు (Jalagam Venkat ) కొత్తగూడెం (Kothagudem Assembly Constituency)లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (All India Forward Bloc Party) తరుపున ఈరోజు నామినేషన్ దాఖలు చేసి షాక్ ఇచ్చారు. బిఆర్ఎస్ నుండి కొత్తగూడెం అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు , సీపీఐ -కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు , బిజెపి – జనసేన పార్టీల అభ్యర్థి గా లక్కినేని సురేందర్ రావు లు బరిలోకి దిగుతున్నారు. మరి కొత్తగూడెం ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.
ఇక జలగం వెంకటరావు విషయానికి వస్తే.. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 9,536 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 2,472 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 16,521 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఖమ్మం జిల్లా నుండి గెలిచిన తొలి, ఏకైక టిఆర్ఎస్ శాసనసభ్యుడు ఈయనే కావడం విశేషం.
2018లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,120 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అఫిడవిట్ కేసులో ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు 2023 జులై 25న తీర్పును వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈసారి బిఆర్ఎస్ కొత్తగూడెం టికెట్ ఇస్తుందని అనుకున్నప్పటికీ..మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం తో..ఈయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలోకి దిగుతున్నారు. మరి ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Read Also : Janasena : తెలంగాణ ఎన్నికల వేళ జనసేన కు షాక్ ఇచ్చిన ఈసీ