KTR Challenge : కేటీఆర్ సెకండ్ బెంచ్ లీడర్ – జగ్గారెడ్డి
KTR Challenge : "అసెంబ్లీ పెట్టండి అని అడగాల్సింది ప్రతిపక్షమే. కానీ ఇప్పుడేమవుతుంది? అసెంబ్లీ పెడతా అంటే, ప్రతిపక్ష నేత రావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. "కేసీఆర్ రావాలని అంటున్నారు... అయితే కేటీఆర్ వస్తానంటున్నారు.
- By Sudheer Published Date - 06:44 PM, Sat - 5 July 25

తెలంగాణ రాజకీయాల్లో రైతు సంక్షేమం ప్రధాన అంశంగా మారింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతుల సమస్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ముఖాముఖీ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. 72 గంటల గడువు ఇచ్చిన కేటీఆర్, రైతుల కష్టాలు, బీఆర్‌ఎస్ పాలనలో అమలైన పథకాలు, కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. వరుసపెట్టి నేతలు కేటీఆర్ ను కడిగేస్తున్నారు. ఇప్పటికే అద్దంకి దయాకర్ , సీతక్క వంటి నేతలు ఎదురుదాడి చేయగా…తాజాగా జగ్గారెడ్డి (Jaggareddy) కేటీఆర్ పై విరుచుకపడ్డారు.
Woman : రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప అవకాశం !
అసెంబ్లీ సమావేశాల అంశంపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరును ఎద్దేవా చేసారు. “అసెంబ్లీ పెట్టండి అని అడగాల్సింది ప్రతిపక్షమే. కానీ ఇప్పుడేమవుతుంది? అసెంబ్లీ పెడతా అంటే, ప్రతిపక్ష నేత రావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. “కేసీఆర్ రావాలని అంటున్నారు… అయితే కేటీఆర్ వస్తానంటున్నారు. అది కూడా సెకండ్ బెంచ్ లీడర్. తెలంగాణ రాజకీయాల్లో ఇది విచిత్రమైన పరిస్థితి” అని ఎద్దేవా చేశారు. సీనియర్ నేతగా ఉన్న కేసీఆర్‌ను అసెంబ్లీలో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వచ్చి మాట్లాడతానని చెప్పడాన్ని జగ్గారెడ్డి హేళన చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి, నాయకత్వ ధోరణిపై ప్రశ్నలు లేవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీలో చురుగ్గా పాల్గొనకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.