Jagga Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ గెలుపు భయం పట్టుకుంది – జగ్గారెడ్డి
తెలంగాణలో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయన్నారు. సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు
- By Sudheer Published Date - 03:54 PM, Mon - 6 November 23

సీఎం కేసీఆర్ (CM KCR) కు కాంగ్రెస్ గెలుపు భయం పట్టుకుందని అన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి (Jaggareddy). కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమన్న జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ (BRS) పార్టీ పిల్ల కాలువతో పోల్చారు. 50 డ్యాములు కట్టిన కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్‌కి పోలిక ఏంటన్న ఆయన… బీఆర్ఎస్ ఒకే ఒక్కటి కట్టిందన్నారు. అది కూడా ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. రుణహామీని నిలబెట్టుకోని సీఎం కేసీఆర్.. ఎన్నికలు రాగానే.. మరోసారి ప్రజలను మోసం చెయ్యడానికి రకరకాల హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే బిజెపి చేస్తున్న ఐటీ దాడులపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కెఎల్ఆర్ దగ్గర ఎమున్నాయ్ అని ఐటీ దాడులు చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా మీద దాడి చేస్తే.. ఐటీ వాళ్లే ఇచ్చి పోవాలని.. ఐటీ వాళ్ళు వస్తే.. అప్పులు లెక్క పెట్టి… డబ్బులు ఇచ్చి పోవాలని వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయన్నారు. సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎంఐఎం సినిమా హైదరాబాద్ కె పరిమితమని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం.. బీఆర్ఎస్ .. బీజేపీ ఒక్కటే అని , బీజేపీ (BJP) ఆడుతున్న అటలో బీఆర్ఎస్, ఎంఐఎం పావులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ ఆగిపోగానే.. బీజేపీ వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయని తెలిపారు. కిషన్ రెడ్డి అయితే సప్పుడు చెయ్యకుండా కూర్చుంటారు అని బీజేపీ కిషన్ రెడ్డి కి ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ గెలిచే దమ్ము లేదు కాబట్టి.. బీఆర్ఎస్ ని అడ్డం పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అపి..బీఆర్ఎస్ ని పెంచే పనిలో పడింది బీజేపీ అని ఆరోపించారు.
Read Also : TDP-Janasena Meet : ఈ నెల 09 న టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ