TS Inter Result 2024 : తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ తేదీ.. అదే !
TS Inter Result 2024 : ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం రోజే వచ్చేశాయి.
- By Pasha Published Date - 03:25 PM, Sat - 13 April 24

TS Inter Result 2024 : ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం రోజే వచ్చేశాయి. దీంతో తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఫలితాల డేట్ కోసం విద్యార్థులు ముమ్మరంగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 20 నుంచి 25వతేదీలోగా ఏ క్షణమైనా తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(TS Inter Result 2024) ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. పరీక్షల వ్యాల్యుయేషన్ ప్రక్రియను మార్చి 10 నుంచి ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు.. ఏప్రిల్ 10వ తేదీన పూర్తి చేశారు. ఇక తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 21 నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరిగితే.. ఈ నెల 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఎక్కువ ఉందని చెబుతున్నారు.
Also Read : April 14th – Big Plan : ఏప్రిల్ 14.. బీజేపీ మేనిఫెస్టో విడుదల తేదీ వెనుక పెద్ద వ్యూహం!
ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు.. ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరోసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. మే 1 నుంచి 4 వరకు సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.