HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Indian Armys Bmp 2 Sarath Joins Operation Asan In Kashmirs Akhnoor

Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్‌’‌తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్

మన దేశంలో చాలా రకాల ఆయుధాల తయారీకి లైసెన్సులు కూడా ఇచ్చేసిన దేశం రష్యా(Operation ASAN).

  • Author : Pasha Date : 29-10-2024 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Army Bmp 2 Sarath Operation Asan Medak

Operation ASAN : ‘బీఎంపీ-2 శరత్‌’ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వాహనాలపై ఇప్పుడు మన దేశమంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తాజాగా కశ్మీరులోని  అఖ్నూర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం నిర్వహించిన ‘ఆపరేషన్ అసన్‌’లో భారత ఆర్మీకి చెందిన ‘బీఎంపీ-2 శరత్‌’‌లను వినియోగించారు. అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ అంబులెన్స్‌పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టికరిపించారు. సోమవారం రోజే ఒక ఉగ్రవాదిని  భద్రతా దళాలు మట్టుబెట్టగా.. మరో ఇద్దరి ఇవాళ ఉదయం అంతమొందించారు. ఈ ఆపరేషన్‌‌ కోసం వెళ్లిన ఎన్‌ఎస్‌జీ దళాలు ‘బీఎంపీ-2 శరత్‌’ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వాహనాలను వినియోగించాయి. తెలంగాణలోని మెదక్‌లో ఉన్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారయ్యే ఈ వాహనాల గురించి వివరాలివీ..

Also Read :Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు

‘బీఎంపీ-2 శరత్‌’‌ గురించి.. 

  • మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సైనికపరంగా అన్ని రకాల సాయాన్ని అందిస్తున్న దేశం రష్యా. మన దేశంలో చాలా రకాల ఆయుధాల తయారీకి లైసెన్సులు కూడా ఇచ్చేసిన దేశం రష్యా(Operation ASAN). భారత్ – రష్యా సంబంధాలు అంత బలంగా ఉన్నాయి మరి.
  • 1960వ దశకంలో ‘బీఎంపీ-1’ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్‌ను మన దేశానికి రష్యా అందించింది. చైనా, పాకిస్తాన్ నుంచి సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు  ఆనాడు వీటిని వినియోగించారు. కాల క్రమంలో భారత్ ఈ వాహనాల్లో సొంతంగా చాలా మార్పులు చేసింది.
  • ‘బీఎంపీ-1’ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్‌కు అడ్వాన్స్‌డ్ వర్షనే ఈ ‘బీఎంపీ-2 శరత్‌’‌.
  • బీఎంపీ అంటే బొయేవయా మషినా పెఖోతీ (Boyevaya Mashina Pekhoty). ఇది రష్యన్ భాషా పదం.
  • బీఎంపీ-2 వాహనాలు నీటిలో కూడా ప్రయాణించగలవు. వీటిపై నుంచి యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లను ప్రయోగించవచ్చు.
  • తెలంగాణలోని మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలోనే వీటిని తయారుచేస్తున్నారు. ఈ వాహనాల చుట్టూ బలమైన కవచం ఉంటుంది. దీనివల్ల ఉగ్రవాదులు కాల్పులు జరిపినా.. లోపల ఉన్న సైనికుల ప్రాణాలకు నష్టం వాటిల్లదు.
  • ఈ ట్యాంకులపై ఉండే భారీ మెషీన్ గన్‌లు, గ్రనేడ్‌ లాంఛర్లతో ఉగ్రవాదులపై కాల్పులు జరపొచ్చు. అందుకే అఖ్నూర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఈజీగా పూర్తయింది.
  • ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ఫాంటమ్‌ అనే పేరు కలిగిన జాగిలాన్ని కోల్పోయింది.

Also Read :Jagdish Uikey : విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక జగదీశ్ ఉయికే.. ఎవరు ?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhnoor
  • BMP 2 Sarath
  • Indian army
  • kashmir
  • Operation ASAN

Related News

Indian Army

ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!

వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.

    Latest News

    • ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..

    • US కంపెనీలకు షాక్

    • పండగవేళ ప్రయాణికులకు TGSRTC షాక్

    • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

    • అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

    Trending News

      • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

      • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

      • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

      • జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

      • ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్ష‌లు త‌ప్ప‌వు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd