India vs Australia 3rd T20: జింఖానా గ్రౌండ్ బాధితులకు బంపరాఫర్.. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేలా!
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో బాధితులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాసటగా నిలిచారు.
- By Balu J Published Date - 07:02 PM, Sun - 25 September 22

జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో బాధితులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాసటగా నిలిచారు. వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో T20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆ గేమ్ కోసం సికింద్రాబాద్‌లోని జింఖానా వేదికగా టిక్కెట్లు కొనడానికి ప్రయత్నించినప్పుడు గాయపడిన పలువురు అభిమానులు గాయపడ్డారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్లను పరామర్శించారు.
రవీంద్ర భారతిలో మంత్రి వారి సంరక్షణ గురించి అడిగి తెలుసుకుని వారితో సరదాగా గడిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత, క్రీడాభిమానులను ప్రత్యక్షంగా క్రికెట్ చూసేందుకు పోలీసు వ్యాన్‌లో స్టేడియానికి వెళ్లేలా మంత్రి ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు మంత్రి కూడా మ్యాచ్ వీక్షించేందుకు వెళ్తున్నారు.