IT Raids : దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు
. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు(IT Raids) జరుగుతున్నట్లు తెలిసింది.
- By Pasha Published Date - 08:02 AM, Tue - 21 January 25

IT Raids : తెలంగాణ అకస్మాత్తుగా ఐటీ రైడ్స్ కలకలం రేగింది. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజాము నుంచే ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్‌లో 8 చోట్ల 55 ఐటీ విభాగం టీమ్‌లు రైడ్స్ చేస్తున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ రైడ్స్ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు(IT Raids) జరుగుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఆయా చోట్ల వివిధ డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దాదాపు రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇంతలోనే ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం.
Also Read :Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?
వసూళ్లలో దూసుకుపోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
- ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేశ్ నటించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయింది.
- అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.
- ఆరో రోజు ఏపీ, తెలంగాణల్లో దీనికి రూ.12.5 కోట్లు వచ్చాయి. ఈ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
- ఇంత భారీ వసూళ్లను పరిశీలించిన ఐటీ అధికారులు.. వీటికి సంబంధించిన లెక్కలను తనిఖీ చేసేందుకే రైడ్స్ చేస్తున్నట్లు తెలిసింది.
- ఈ మూవీ వసూళ్ల విషయంలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లాంటి సినిమాలను కూడా వెనక్కు నెట్టేసింది.
- డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లో ఇది సెకండ్ బెస్ట్ మూవీ.
- హీరో వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3ల రికార్డును ఈ మూవీ సులువుగా బ్రేక్ చేసింది.
- రెండో వారంలో దీని వసూళ్లు రూ.200 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు.