EC : నవంబర్ 30 న ఏముందంటూ..ఈసీ ప్రచారం
తాజాగా నవంబర్ 30 న ఏముంది..? అంటూ సరికొత్తగా ప్రచారం మొదలుపెట్టారు
- Author : Sudheer
Date : 28-11-2023 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజలకు ఓటు(Vote)పై అవగాహనా కల్పించేందుకు ఎన్నికల సంఘం రకరకాల ప్రచారాలు చేస్తూ ప్రజల్లో ఓటు ఫై అవగాహనా కలిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రచారం చేసిన అధికారులు..తాజాగా నవంబర్ 30 (November 30) న ఏముంది..? అంటూ సరికొత్తగా ప్రచారం మొదలుపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Polling) నవంబర్ 30 న జరగనున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపును కోరుకుంటూ ప్రజల్లో తిరుగుతూ..ప్రచారం చేస్తూ వస్తున్నారు. నవంబర్ 30 న పోలింగ్ అని చెపుతూ..ఓటింగ్ మిషన్ లో తమ స్థానం ఎక్కడ ఉంటుందో..సీరియల్ నెం, గుర్తు తో సహా చెపుతూ ఓటర్లలో అవగాహనా కల్పిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల అధికారులు తమ వంతు బాధ్యత ను నిర్వర్తిస్తూ..మరింతగా అవగాహనా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ‘నవంబర్ 30 న ఏముంది ..?’ అని రోడ్డు ఫై భారీ హోర్డింగ్ ఒకటి పెట్టి ప్రజల్లో అవగాహనా తెస్తున్నారు. ఈ ప్రకటన అందర్నీ ఆకట్టుకుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈసారి ఎన్నికల పోరు రాష్ట్రంలో గట్టిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ మరోసారి విజయం సాధించాలని చూస్తుంటే..ఆ ఛాన్స్ బిఆర్ఎస్ కు ఇవ్వదంటూ కాంగ్రెస్ , బిజెపి లు చూస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మద్యే అసలైన పోరు జరగబోతుంది. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.
Read Also : MLC Kavitha: బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల కొత్త డ్రామా