HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Will Defeat Kcr In Next Assembly Elections Eatala

Eatala On KCR: కేసీఆర్ పై పోటీకి ఈటల సై!

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియానుద్దేశించి మాట్లాడారు.

  • Author : Balu J Date : 09-07-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etala
Etala

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియానుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఈటల అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దళితులు,గిరిజనులతోపాటు అన్ని వెనుకబడిన వర్గాల వారిని కేసీఆర్‌ మోసం చేశారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి నాయకుడు సువేందు అధికారి విజయం సాధించిన సీన్ గజ్వేల్‌లో పునరావృతం అవుతుందని ఈటల అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో జులై 15 నుంచి జరగనున్న రెవెన్యూ సమావేశాలతో భూ సంబంధిత సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారి పరిష్కరించేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని ఆయన తప్పుబట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • cm kcr
  • eetala rajendar
  • gajwel meeting

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd