Drugs : వాట్సాప్ చాట్స్ చెకింగ్.. ఇదేం ‘పోలీసింగ్’ అంటున్న నెటిజన్స్!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినా ఏపీ, తెలంగాణ పేర్లే వినిపిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు
- By Balu J Published Date - 05:22 PM, Fri - 29 October 21

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినా ఏపీ, తెలంగాణ పేర్లే వినిపిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ప్రత్యేక చర్యలకు ఆదేశించారు. ఏపీలో ఎక్కువగా మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగవుతుండటంతో పోలీసుల ఏజెన్సీ ఏరియాలపై నిఘా పెట్టారు. ఇందుకోసం డ్రోన్స్ తో కూడా జల్లెడ పడుతూ గంజాయిని పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ పోలీసులు చెకింగ్ పాయింట్ల వద్ద నిఘా వేస్తున్నారు. వాహనాలను చెక్ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ సిటీ డ్రగ్స్ అడ్డాకు కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర గాలింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీస్ సిబ్బంది ప్రధాన రహదారులపై తిష్టవేస్తూ వాహనదారులను అడ్డుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా మొబైల్స్ తీసుకోవడం, వాట్సాప్ చాట్స్ చెక్ చేయడం లాంటివి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఒక వ్యక్తి ఫోన్‌లోని వాట్సాప్ చాట్‌లు పరిశీలించామని చెప్తున్నారు పోలీసులు. మంగళ్‌హాట్, బోయిగూడ, ధూల్‌పేట్, జుమెరత్ బజార్ లాంటి ఏరియాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసులు వాట్సాప్ చాట్స్ చెక్ చేయడం పట్ల ప్రజలు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మసూద్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే జనాలపై పోలీసులు నిఘాపెట్టారని, బంజారాహిల్స్, హైటెక్ సిటీల్లో ఏరియాల్లో ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు.
Related News

NewsClick News: న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేసిన ఢిల్లీ పోలీసులు
న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బులు అందుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు.