Hyd Metro : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు
రేపు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా రేపు అర్ధరాత్రి వరకు ఆ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండబోతాయని తెలిపింది
- Author : Sudheer
Date : 24-04-2024 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)..క్రికెట్ అభిమానులకు (Cricket Fans ) గుడ్ న్యూస్ తెలియజేసింది. రేపు ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా రేపు అర్ధరాత్రి వరకు ఆ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండబోతాయని తెలిపింది. రాత్రి 12:15 గంటలకు చివరి ట్రైన్ ప్రారంభమై.. 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఉప్పల్ స్టేడియం – ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. మిగతా మార్గాలలో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు. అంటే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక రేపు ఉప్పల్ స్టేడియం లో సన్రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ (RCB vs SRH) జరగబోతుంది. ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఈ సీజన్ లో సన్రైజర్స్ దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. గత రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పుతూ అభిమానుల్లో సంతోషం నింపుతూ వస్తుంది. మరి..రేపు హోం గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఏ రేంజ్ లో ఆడుతుందో..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
Read Also : Fahad Fazil Avesham : బాక్సాఫీస్ దగ్గర ఆవేశం.. ఫాఫా సరికొత్త సంచలనం..!